News

నేటితో ముగియనున్న రాష్ట్రపతి విడిది


రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాల విడిది నగరంలో నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ వెళ్లనున్నారు. 10 రోజుల పాటు ప్రణబ్ హైదరాబాద్‌లో గడిపారు. పర్యటన సందర్భంగా తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని అదేవిధంగా ఏపీలోని తిరుపతి వేంకటేశ్వరుడిని ఆయన దర్శించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రాష్ట్రపతికి వీడ్కోలు పలకనున్నారు